ప్రముఖ సీనియర్ ఎడిటర్ పి.వెంకటేశ్వరరావు (72) కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చెన్నైలో ఆయన తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్ నటించిన ‘యుగంధర్’తో పాటు ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’, ‘కెప్టెన్ కష్ణ’, ‘ఇద్దరు అసాధ్యులు’, ‘ముద్దాయి’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేశారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200కు పైగా సినిమాలకు పని చేసి సౌత్ ఇండియాలో ఎడిటర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఎన్నో గొప్ప చిత్రాల ఘన విజయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్వరరావు మతి పట్ల తెలుగు ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వర రావు (చంటి), ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె వెంకటేష్ సంతాపాన్ని ప్రకటించారు. వెంకటేశ్వరరావు అంతిమ సంస్కారాలు గురువారం చెన్నైలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.