నవతెలంగాణ – హైదరాబాద్
ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు నర్సింగ్ ప్రసాద్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఎమ్మెల్యే ముఠాగోపాల్‌కు పంపారు. సోమవారం ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 33 సంవత్సరాలుగా ముఠా గోపాల్ అనుచరుడిగా ఉన్నానని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారని, వయసుకు కూడా గౌరవం ఇవ్వడం లేదని అందుకే రాజీనామా చేశానని తెలిపారు. దానితోపాటు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.