నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ తెలుగుదేశం నాయకుడు కూన వెంకటేష్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు సీనియర్ తెలుగుదేశం నాయకుడు కూన వెంకటేష్ గౌడ్. ఈ తరుణంలోనే.. ఇవాళ ఉదయం సీనియర్ తెలుగుదేశం నాయకుడు కూన వెంకటేష్ గౌడ్ మరణించారని సమాచారం. ఇక బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో తన నివాసం వద్ద ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు కుటుంబ సభ్యులు. పలుమార్లు టిడిపి నుండి సనత్ నగర్..సికింద్రాబాద్ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సీనియర్ తెలుగుదేశం నాయకుడు కూన వెంకటేష్ గౌడ్. ఇక ఈ సంఘటనపై ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.