గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని.. రాళ్లు వేసే వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. అందరూ అందరికీ నచ్చాలనదని.. అయితే మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలన్నారు.. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. నాపై రాళ్లు విసిరితే వాటితోనే భవంతులు కడుతానని పేర్కొన్నారు. పిన్స్ వేస్తే ఆ పిన్స్ గుచ్చుకొని వచ్చే రక్తంతో నా చరిత్ర పుస్తకం రాస్తానంటూ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళా రాష్ట్రపతి మహిళా బిల్లుపై సంతకం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఒక్క మహిళా కూడా మంత్రిగా లేదన్నారు. ప్రతీ మహిళా ఒక కలతో రాజకీయాల్లోకి వస్తారని.. అవకాశం వచ్చినప్పుడు మహిళలు పురుషులతో పోల్చితే కానీ 20 రెట్లు ఎక్కువగా పని చేస్తే కానీ మహిళకు గుర్తింపు లభించదని పేర్కొన్నారు. ఇకపై రాజకీయాల్లో మహిళా పవర్ కనిపిస్తుందని చెప్పారు గవర్నర్ తమిళి సై.

Spread the love