కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం..

నవతెలంగాణ -ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కావడంపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రామ మందిరం ఓపెనింగ్‌కు రావాలని అయోధ్య ట్రస్ట్ పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ లోక్ సభ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటన ఇవాళ ప్రకటన విడుదల చేశారు. ఆలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు రావడం లేదని ఆయన తెలిపారు. ఆలయ ప్రారంభోత్సవం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా మారిందని కాంగ్రెస్ విమర్శించింది. మతం అనేది వ్యక్తిగత అంశంమని.. కానీ అయోధ్య రామాలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రాజెక్ట్ మార్చాయంది. అయోధ్య రామమందిరం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని.. పార్లమెంట్ ఎన్నికల కోసమే అసంపూర్ణ అలయాన్ని బీజేపీ ప్రారంభిస్తోందని ఆరోపించింది.

Spread the love