కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఈ కసరత్తు మొదలుకానున్నట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ కార్డులతో గతంలో ఉన్న రూ.5 లక్షల చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 89,98,546 ఆహార భద్రత కార్డులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఓ చిన్న పుస్తకం మాదిరి ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫొటోతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు ఉండేవి. ఆ తర్వాత వీటిస్థానంలో రైతుబంధు పాస్‌బుక్‌ సైజ్‌లో రేషన్‌కార్డులు జారీ అయ్యాయి. ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు.. వెనుకవైపు చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. ఆ తర్వాత రేషన్‌కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి.

Spread the love