తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Telangana-Highcourt
Telangana-Highcourt

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్‌ కిందకే వస్తాయని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ బుధవారం తీర్పు ప్రకటించారు. 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడింది. ఆదివాసుల తరపున  న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే, ఆ 23 గ్రామాలు రాజ్యాంగ పరిధిలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి రావనీ ఆదివాసీయేతర నేతలు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5 షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించినదని తెలిసిందే.

Spread the love