సెప్టెంబర్ 18నే వినాయక చవితి…

నవతెలంగాణ – హైదరాబాద్ :  ఈ నెల 18వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని, 28న నిమజ్జనం చేయాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పంచాంగకర్తలు, శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు 18వ తేదీనే సూచించారని సమితి గుర్తు చేసింది. ఖైరతాబాద్ వినాయకుడితో పాటు హైదరాబాద్​లో మొత్తం 3 లక్షల విగ్రహాలు ప్రతిష్టించనున్నట్లు వివరించింది. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా నిర్వహించడంపై బుధవారం జీహెచ్​ఎంసీ హెడ్డాఫీస్​లో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మీటింగ్ తర్వాత భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంత్​రావు మీడియాతో మాట్లాడారు. సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులకు తాము కొన్ని సూచనలు చేశామన్నారు. వాటిపై సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. వినాయక చవితిపై ఇప్పటి దాకా క్లారిటీ లేని కారణంగా 18 లేదా 19వ తేదీ జరుపుకోవాలనే గందరగోళంలో భక్తులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది తలెత్తిన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు.

Spread the love