సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. మణికొండ మున్సిపాలిటీలోని అల్కాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్-20లో నివాసం ఉంటున్న చంద్రకాంత్.. ఈ రోజు రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 2015లో శిల్ప అనే మహిళను చంద్రకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రకాంత్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పవిత్రతో చంద్రకాంత్ కొంతకాలంగా సహజీవనం చేసినట్లు సమాచారం. త్రినయిని సీరియల్ లో పవిత్రతోపాటు చంద్రకాంత్ నటించారు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లోనూ చంద్రకాంత్ నటిస్తున్నారు.

Spread the love