జమ్మూ కాశ్మీర్ లో వరుసగా ఉగ్ర దాడులు..

నవతెలంగాణ – జమ్మూకశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌లో వరుసగా ఉగ్రవాదుల దాడులు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు గాయపడ్డాడు. గత మూడు రోజుల వ్యవధిలో ఇది నాలుగవ ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. ఇది దోడా జిల్లాలోనే రెండో ఎన్‌కౌంటర్. జూన్ 9న రియాసీలో యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది మరణించారు. దీని తర్వాత మంగళవారం సైతం కథువా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Spread the love