ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు

నవతెలంగాణ – భూత్పూర్: శేరిపల్లి (హెచ్) గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై వాహనాలను, ఇతర బరువులను తొలగించే క్రేన్‌ను ఓ ప్రయివేట్ బస్సు శనివారం రాత్రి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుండి మహబూబ్‌నగర్ భూత్పూర్ మీదుగా వెళ్లవలసిన క్రేన్ ఫ్లైఓవర్ మీదుగా ముందుకు వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక తమ వాహనాన్ని ఆపి వాహనాన్ని ఆపి సమీపంలో ఉన్న వారిని తామూ మహబూబ్‌నగర్ వెళ్లాలి అన్న విషయాన్ని చెప్పడంతో వాహనాన్ని తిరిగి వెనక్కు తీసుకువెళ్లి భూత్పూర్ నుండి మహబూబ్ నగర్ వెళ్లాలి అని సూచించారు.

Spread the love