నవతెలంగాణ- రామారెడ్డి
కులవృత్తుల వారిని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించగా దరఖాస్తులు చేసుకునేవారు. దరఖాస్తు తో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జతపరచవలసి ఉండగా, మీసేవ కేంద్రాల్లో తాసిల్దార్ కార్యాలయంలో సర్వర్ ఎర్రర్ రావటం, డౌన్ కావడంతో, సంబంధిత అధికారులు ధ్రువీకరణ పత్రం అందించడంలో ఆలస్యం అవుతుండడంతో, దరఖాస్తు చేసుకోవడం 20వ తేదీతో గడువు మూగనున్నందున, దరఖాసుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దరఖాస్తు చేసే గడువును పెంచాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.