వనదేవతలను దర్శించుకున్న శేషు మాధవ్, డాక్టర్ సురేందర్ 

– వనదేవతలను దర్శించుకున్న ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శేషు మాధవ్, ప్రొఫెసర్ పీడియాట్రిక్ డాక్టర్ సురేందర్ 
నవతెలంగాణ -తాడ్వాయి
మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శేషు మాధవ్, ప్రొఫెసర్ పీడియాట్రిక్ డాక్టర్ కెఎంసీ, ఎంజీఎం పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ సురేందర్ లు శనివారం వనదేవతలను దర్శించుకున్నారు. పూజారులు ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనదేవతల సేవలు ప్రతిష్ట ఆత్మకమైనవని అని, వనదేవతలను దర్శించుకోవడం పుణ్యప్రదం అని, ఎంతో ఆహ్లాదంగా ఉంది అన్నారు.
Spread the love