గచ్చిబౌలిలో ఆశా న్యూరోమోడ్యులేషన్‌ క్లినిక్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ : మానసిక రోగులకు అత్యుత్తమ చికిత్సలు అందించడం ద్వారా, వారిలోని మానసిక, భావోద్వేగ, వ్యసన సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపే ఆశా హాస్పిటల్‌ తన అనుబంధ విభాగంలో ఉన్న ఆశా న్యూరోమోడ్యులేషన్‌ క్లినిక్‌ను గచ్చిబౌలిలో ప్రారంభించింది. దీంతో ఆ పరిసర ప్రాంత ప్రజల అవసరాలకు తగిన చికిత్స అందజేయడం జరుగుతుందని ఆ సంస్థ డైరెక్టర్‌ ఎంఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. మానసిక, భావోద్వేగ, ధూమపాన, ఇతర వ్యసనాల వారు ఏర్పడిన సమస్యల పట్ల వారికి అనుమానాస్పదంగా ఉండటం కాకుండా, వారి సమస్యలకు సరైన చికిత్స అందించడం ద్వారా వారికి సహాయం చేయగలమన్నారు.

Spread the love