సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి

– లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్

నవతెలంగాణ కొత్తూరు
శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లంబాడీల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తేదీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో కొలువుదీరిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వం సేవలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి లంబాడీల ఆత్మగౌరవాన్ని నిలపాలని కోరారు.
Spread the love