ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..ఏడుగురు చిన్నారులు మృతి

seven-children-died-in-an-accident-at-the-hospitalనవతెలంగాణ – ఢిల్లీ
ఢిల్లీలోని ఓ పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మరణించిన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న బేబీ కేర్ సెంటర్‌లో రాత్రి 11.32గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదం సమయంలో ఆస్పత్రి భవనం నుంచి 12 మంది నవజాత శిశువులను రక్షించామని, అయితే మరో ఆరుగురిని కాపాడలేకపోయామన్నారు. రాత్రి ప్రమాదంపై కాల్ వచ్చిందని, ఆ తర్వాత 8మంది సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. మరో ఘటనలో ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని నివాస భవనంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని 13మందిని రక్షించి మరో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Spread the love