నవతెలంగాణ చెన్నై: తమిళనాడులోని తిరువన్నమలైలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అందన్పూర్ బైపాస్ వద్ద టాటా సుమో – బస్సు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమో తిరువన్నమలై నుంచి బెంగళూరు వెళ్తుండగా సేంగం వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో సుమోలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఏడుగురు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 10 మందికి గాయాలయ్యాయి. మొత్తం 14 మంది సెంగం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.