కుంటను తలపిస్తున్న మురుగునీరు

– దోమలు, దుర్వాసనతో ప్రజలు పరేషాన్

– మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు, ఎంపీడీవో కార్యాలయం పక్కనే ఈ దుస్థితి
– మురుగును నివారించాలి: ప్రజలు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం అతి సమీపంలో కాంపౌండ్ వాళ్ళు పక్కన కాలి స్థలంలో మురుగునీరు కుంటను తలపించేలా నిల్వ ఉండటంతో జూన్ నెలలో అధికంగా దోమల బెడద వల్ల అనారోగ్యానికి గురై 30 పడకల ప్రభుత్వ దావకానకు వచ్చే పేషంట్లకు మురుగునీరు వల్ల దుర్వాసన, దోమలు, ఈగలు మురుగునీరు స్తావరంగ ఏర్పాటు చేసుకుని వృద్ధి చెంది రాత్రి పూట సైర విహారం చేస్తూ స్థానికుల నివాసంలోకి చేరి ప్రజలను రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. దుర్గందంతో మండల కార్యాలయాలకు కార్యకలాపాలకు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు,పలు గ్రామాల ప్రజలు నిత్యం వందల మంది కార్యాలయం చుట్టూ సొంత పనుల కోసం నడకదారిన, వాహనాలపై ప్రయాణిస్తూ మురుగునీటి పక్కనుంచి ఇటు అటు వెళ్తుంటారు. కానీ మండల కేంద్రంలోని ఉన్నత అధికారులు ఉన్న ఎవరు పట్టించుకోకపోవడం వీధుల పట్ల నిర్లక్ష్యానికి తావునిస్తుంది.మురుగు నీటిలో చెత్త చెదరం పేరుకపోయి నీటిలో లార్వా పుట్టలు పుట్టలుగా జీవిస్తూ వృధి చెందుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా నీటి నిల్వ లేకుండా తొలగించి, శానిటేషన్ చేసి లార్వాను నియంత్రించే విధంగా చొరవ తీసుకొని డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా నివారించాలని అధికారులను కోరుతున్నారు.
Spread the love