చిన్నారిపై బాలుడి లైంగికదాడి..

నవతెలంగాణ-రాయపోల్ : అభం శుభం తెలియని పసికందు, అల్లారి ముద్దుగా తల్లి ఒడిలో పెరుగుతున్న బాల్యం ఇంటి వద్ద ఆడిస్తూ పాడిస్తూ పెంచే చిన్నారిపై కామాంధుడు కన్ను పడింది. ఇంటి ముందే ఉంటూ ప్రతిరోజు చిన్నారిని ఎత్తుకొని ఆడిస్తూ ఎవరు లేని సమయంలో తనలోని కామం, క్రూరత్వం బయటపడి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. దౌల్తాబాద్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బాలుడు (16) వారి ఇంటి ముందు ఉండే చిన్నారి ( 5) ని ప్రతిరోజు ఎత్తుకొని ఆడిస్తుండేవాడు. చిన్నారి ఇంటికి వీళ్ళ ఇంటికి ఆడుతూ పాడుతూ ప్రతి రోజు తిరుగుతుండేది. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడులోని కామాంధుడు నిద్రలేచి చిన్నారిపై కాటువేయాలని చూసాడు. అదే క్రమంలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడుతుండుగా గమనించిన చిన్నారి బంధువు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం చిన్నారి తండ్రి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఫోక్సో కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ తెలిపారు.
Spread the love