ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడిపై లైంగిక వేధింపుల కేసు

నవతెలంగాణ – కర్నాటక : కర్నాటకలోని హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై కేసు నమోదైంది. సూరజ్ ఈనెల 16న తనను ఫామ్ హౌస్‌కి పిలిచి లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహకరించకపోతే తనను చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో సూరజ్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే మహిళపై లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

Spread the love