
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 16వ నగర మహాసభలు స్థానిక నాందేవ్వాడలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జెండా ఆవిష్కరణ నగర ఉపాధ్యక్షురాలు వీణ తో ఆదివారం ప్రారంభించారు. నగర మహాసభల సందర్భంగా సీత రామ్ ఏచూరికి నివాళి అర్పించారు. ఈ మహాసభలను ఉద్దేశించి మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శోభన్ మాట్లాడుతూ.. 1970లో ఎస్ఎఫ్ఐ పొరడు పోసుకొని విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి ఛాంపియన్ గా నిలిచిందని అన్నారు. దేశంలో శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాలనూ ప్రశ్నిస్తుందని అన్నారు. విద్యార్థులంతా కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దుకు రణం చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దీపిక, విగ్నేష్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిన విద్యాశాఖ కు మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటనీ వాపోయారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి పల్లెత్తు మాట మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి సర్ప లింగం ఎస్ఎఫ్ఐ నాయకులు దినేష్, చక్రి, ఆజాద్, రాజు, వినీత్, నవదీప్, రాణి, వివేక్, తదితరులు పాల్గొన్నారు.