నవతెలంగాణ – కంటేశ్వర్
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి అని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ అధ్వర్యంలో ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ఖలిల్ వాడి ప్రభుత్వ పాఠశాలలో సర్వే చేసి స్కూల్ ఇంచార్జ్ హెచ్ ఎం శ్రీనివాస్ తో మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకొని దాదాపు 10 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వ విద్యాసంస్థల పరిస్థితి దయనీయంగా ఉంది. అని ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు అనేకమార్లు తెలియజేసిన ఫలితం మాత్రం శూన్యం అని అన్నారు. అలాగే రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా అనేక పోరాటాలు నిర్వహించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమం అనే పేరుతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం అని విద్యార్థులను,ప్రజలను మోసం చేసే రకంగా ప్రకటనలకే పరిమితమైందని ఏద్దేవ చేసారు.అలాగే తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు అంటు రంగు ఆర్భాటలతో కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలనె చిత్తశుద్ధి లేదని అన్నారు. అలాగే ఖాలీల్ వాడి స్కూల్ లో హిందీ సబ్జెక్ట్ పోస్టు గత 4 సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న కనీసం విద్యావాలేంటరీలను కూడా నియమించకపోవడం బాధాకరం అని ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు గణేష్ రామ్, నరేష్, రమ్య, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.