డీకే అరుణ ఇంటిని ముట్టడించిన ఎస్ఎఫ్ఐ నాయకులు 

నవతెలంగాణ – మహబూబ్ నగర్: నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి, పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్‌ఐ నాయకులు బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంటిని ముట్టడించారు. డీకే అరుణ ఇంటి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని, నీట్ ఎగ్జామ్ మళ్లీ పెట్టాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష సరిగా నిర్వహించలేదని, ఎన్‌టిఏను రద్దు చేయాలని కోరారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్, యూజీ, పీజీ నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్‌ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నా వినకుండా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు పలువురు నాయకులకు లారీలో ఎక్కించుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Spread the love