నీట్ గ్రేస్ మార్కులు రద్దు చేయడం కాదు, పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలి: ఎస్ఎఫ్ఐ

– ఎన్.టి.ఎ ను రద్దు చేయాలి,
– ప్రస్తుతం ఉన్న
వారిని ఎన్.టి.ఏ. బాధ్యతల నుండి తప్పించాలి0
– ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన
నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో నీట్ పరీక్ష గందరగోళం పై కేంద్రం గ్రేస్ మార్కులును పోందిన వారి మార్కులు మాత్రమే రద్దు చేసి జూన్ 23న రీ -ఎగ్జామ్ నిర్వహించి, జూన్ 30న ఫలితాలు ఇస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలుపడం కాదని, అసలు పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య పార్కు నుండి భారీ ర్యాలీ అనంతరం నిరసన సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజులు మాట్లడుతూ.. నీట్ పరీక్ష లీకేజీపై కేంద్రం స్పందించకుండా, ఎవరైతే గ్రేస్ మార్కులు పోందారో వారి స్కోర్ కార్డులు రద్దు చేసి, వారికి మళ్ళీ రీ -ఎగ్జామ్ నిర్వహించడం అంటే నీట్ అవకతవకలు ప్రక్కదారి పట్టించడమే అని అన్నారు. దీని వల్లన నీట్ ర్యాంకులు తారుమారు అయ్యి గందరగోళం ఎర్పడుతుందని తెలిపారు. నీట్ పరీక్షపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయకుండా, ఎన్.టి.ఏ ఎకపక్షంగా వ్యవరిస్తుందని అన్నారు. పరీక్ష కంటే ముందు రోజు బీహార్ రాష్ట్రంలో పాట్నాలో 13 మందిని పేపర్ లీకేజీ విషయంలో అరెస్టు చేశారని, హర్యానాలో కూడా ఒకే సీరియల్ నెంబర్ కల్గిన ఎనిమిది మంది విద్యార్థులకు టాప్ ర్యాంకులు వచ్చాయని, రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాలలో కూడా ఇలాంటి లీకేజీ అంశాలు ముందుకోచ్చాయని, వాటిపై విచారణ జరపకుండా కేవలం గ్రేస్ మార్కులు మాత్రమే రద్దు చేసి రీ ఎగ్జామ్ పెట్టడం అంటే నీట్ అవకతవకలు ప్రక్కన పెట్టి విస్మరించడం అవుతుంది అని తెలిపారు. కేంద్రం, బీజేపీ పాలిత రాష్ర్టాలలో మాత్రమే నీట్ ర్యాంకులు, పేపర్ లీకేజీ ఆరోపణలు ఉన్నాయని, వాటిపై తక్షణమే విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రీ- ఎగ్జామ్ నిర్వహించి, ఎన్.టి.ఎ.ను రద్దు చేసి. విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఎన్.టి.ఎ.చైర్మన్, డైరెక్టర్లను తప్పించాలని వారిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర సహాయ కార్యదర్శులు దామెర కిరణ్,మమత, వీరభద్రం, కె.అశోక్ రెడ్డి, ఉపాధ్యాక్షులు ప్రశాంత్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య, లెనిన్ గువేరా,మందా శ్రీకాంత్, యార ప్రశాంత్, తారాసింగ్, జె.రమేష్,విఘ్నేష్, వినోద్, ప్రశాంత్, అరవింద్, శ్రీజ, మహేష్,నరహరి, ఎల్.రాజు, టి.రవి, స్టాలిన్, భరత్, సాయికృష్ణ, ఆభినవ్,సుష్మ, సుమ, నందిని, తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love