నవతెలంగాణ – కంటేశ్వర్
భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ యూనిఫామ్ అమ్మే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కి బుధవారం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో 2023-2024 విద్యాసంవత్సరం ప్రారంభం అవ్వడమే ఆలస్యం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్స్ వరకు బుక్స్, యూనిఫామ్, అడ్మిషన్ ఫీ, డొనేషన్ ఫీ అని ఇష్ట రాజ్యంగ వ్యవహరిస్తూ విద్యార్ధుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అన్నారు.అలాగే ఫీజు పట్టికలను పెట్టడం కానీ, పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు గానీ గాలికి వదిలేసి, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటామని సర్క్యులర్ జారీ చేసిన, ప్రైవేట్ విద్యాంస్థల యాజమాన్యాలు లెక్క చెయ్యకపోవడం విడ్డూరమన్నరు.అదే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక దృష్టి పెట్టి నిబంధలను ఉల్లంఘించే ప్రైవేటు విద్యాంస్థలపై గుర్తింపు రద్దు చేసే రకంగా కృషి చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు గణేష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.