నవతెలంగాణ-కంటేశ్వర్ : మాజీ ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు సీతారాం ఏచూరి గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించి అమర్త్యసేన్ శిష్యుడిగా అంచేలు అంచెలు ఎదిగి ఈ దేశానికి వన్నె తెచ్చిన గొప్ప నాయకుడుగా ఎదిగారని అతని మరణం కమ్యూనిస్టు ఉద్యమనికి తీరని లోటని అన్నారు. అతని మరణానికి ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, జిల్లా కమిటీ సభ్యులు దినేష్, నగర ఉపాధ్యక్షులు ఆజాద్, విశాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.