శభాష్ రవి

– కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం
నవతెలంగాణ –  వెంకటాపురం
చిన్నతనం..నుంచి అతనికి రెందుకాళ్ళు పనిచేయవు..ఒక వ్యక్తి తోడుగా ఉంటేనే ఎక్కడికైనా వెళ్లలేని పరిస్థితి.తాను వైకల్యం లేని వారితో పోటీ పడాలని అనుకున్నాడు. .బ్రతుకు దేరువు కోసం మండల కేంద్రంలో మీసేవ కేంద్రం నిర్వహించుకుంటూనే..ఉన్నత చదువులో రాణించాలని అనుకోని ఎల్ ఎల్ బి పట్టా పొందాడు.అతని ఆశయం ముందు అంగవైకల్యం ఓడి పోయేలా చేసుకున్నాడు.ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకుని శభాష్ అనిపించుకున్నాడు ములుగు జిల్లా వెంకటాపురం కు చెందిన చిడెం రవికుమార్. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఏజన్సీ రూరల్ ఏరియాలో మీసేవ నిర్వాహకుల సన్మాన కార్యక్రంలో భాగంగా మండల కేంద్రంలో మీసేవ నిర్వాహకులు చిడెం రవికుమార్ ను సన్మానించారు. మండలం లో సూపరిచితుడు ,భూసమస్యలపై మీసేవ కేంద్రానికి వచ్చే రైతులకు తన వంతుగా సలహాలు ఇస్తూ . వివిధ దరఖాస్తుల తో వచ్చిన గ్రామస్తుల తో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్న రవిని కి ఉత్తమ పురస్కారం దక్కడంతో పలువురు అభినందించారు.

Spread the love