షారుఖ్ ఖాన్ కు స్వల్ప అస్వస్థత

నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ కు షారుఖ్ తన పిల్లలతో కలిసి హాజరైన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ పూర్తయ్యాక ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. షారుఖ్ కు వడదెబ్బ తగిలినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ను షారుఖ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Spread the love