షహీన్‌ షా అఫ్రిది కొత్త చరిత్ర..

నవతెలంగాణ- హైదరాబాద్: పాకిస్తాన్‌ పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేలలో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన ఫాస్ట్‌ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌ తాంజిద్‌ హసన్‌ తో పాటు నజ్ముల్ హోసేన్‌ శాంతోను ఔట్‌ చేయడం ద్వారా అఫ్రిది వన్డేలలో వంద వికెట్లు పడగొట్టాడు. వంద వికెట్లు పడగొట్టేందుకు షహీన్‌ 51 మ్యాచ్‌లు తీసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉంది.

Spread the love