డిజిట‌ల్ చెల్లింపుల్లో భార‌త్ టాప్‌ : శ‌క్తికాంత దాస్‌

fixed-interest-rates-on-loans

నవతెలంగాణ-హైదరాబాద్ : గత 12 ఏండ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాగే మొత్తం ఆన్‌లైన్ పేమెంట్స్‌లో 49 శాతం మనదేశంలోనే జరుగుతున్నాయని ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో తెలిపారు. ‘2012-13లో దేశంలో 162 కోట్ల రిటైల్ చెల్లింపులు డిజిటల్ పేమెంట్స్ అయితే, 2023-24 నాటికి 14,726 కోట్లకు పెరిగింది. అంటే గత 12 ఏండ్లలో డిజిటల్ పేమెంట్స్ సుమారు 90 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్త డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 49 శాతం భారత్‌లోనే సాగుతున్నాయి` అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. యూపీఐ.. భారత్‌లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన పేమెంట్స్ సిస్టమ్‌గా మారిందన్నారు. `దేశీయంగా డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేయడంలో యూపీఐ’దే కీలక పాత్ర. 2023లో జరిగిన ఆన్ లైన్ పేమెంట్స్‌లో 80 శాతం దీనిదే. 2017లో 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా, 2023 నాటికి అది 11,761 కోట్లకు పెరిగింది. రోజూ సగటున 43 కోట్ల యూపీఐ పేమెంట్స్ సాగుతున్నాయి’ అని శక్తికాంత దాస్ చెప్పారు.

Spread the love