నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండల ఎంపీడీవో గా శంకర్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇన్చార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాను కామారెడ్డి నుంచి బదిలీపై వచ్చినట్లు శంకర్ తెలిపారు. ప్రజల సహాయ సహకారాలతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్చార్జి ఎం పి ఓ శ్రీనివాస్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి ఎంపీడీవో గోపాలకృష్ణ, రెంజల్ సూపరిండెంట్ శ్రీనివాస్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.