నవతెలంగాణ – శంకరపట్నం:
మాదిగ జాతి అభ్యున్నతికి అహర్నిశలు పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ ఎ బి సిడి వర్గీకరణకు బాటలు వేసిన, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం, గా సన్మానించనున్నట్లు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నరసయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,30 ఏళ్ల నుండి మాదిగ కులానికి జరుగుతున్న అన్యాయాలపై న్యాయపరంగా పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా కోర్టు ఎస్సీ వర్గీకరణకు తీర్పునివ్వడంతో ఢిల్లీకి వెళ్లి ఎస్సీ రిజర్వేషన్ కు కృషి చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోపాటు కేంద్ర మంత్రులను వివిధ రాజకీయ పార్టీల నాయకులు కృషిచేసిన ప్రతి ఒక్కరిని కలిసి కృతజ్ఞతలు తెలిపి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు ఎస్సీ వర్గీకరణ సాధన కర్త మంద కృష్ణ మాదిగ హైదరాబాద్ పట్టణానికి వస్తున్న సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికి శాల్వాలతో పూలమాలతో సన్మానం చేయనున్నట్లు, ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి ఎమ్మార్పీఎస్ ఆయా మండల శాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో వాహనాల్లో హైదరాబాద్ కు బయలుదేరినట్లు, తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల అధ్యక్షుడు కనుకుంట్ల శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి కోడూరి మహేష్, ఎంబీసీ మండలాధ్యక్షుడు సమ్మయ్య, నాయకులు చల్లూరి రాజేందర్, ఆరెపల్లి తిరుపతి, తదితరులు ఉన్నారు