గంజాయి సేవించిన షణ్ముఖ్..వైద్య పరీక్షల్లో నిర్ధారణ

నవతెలంగాణ-హైదరాబాద్ : బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబ్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ అయిన సంఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసిపి రమణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… షణ్ముక్(31) అన్న సంపత్ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనను పెళ్లి చేసుకుంటాడని చెప్పి తనని శారీరకంగా పలుమార్లు అనుభవించాడని, అంతేకాకుండా మరొక పెళ్లి చేసుకున్నాడని సంపత్(31) పై ఆ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంపత్ కోసం అతడి ఫ్లాట్ కు ఎస్సై అశోక్ వర్మ, సిబ్బందితో కలిసి వెళ్లారు. అతని ప్లాట్ సోదా చేయగా యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ అనే వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుండి 18 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవించాడని వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Spread the love