డీకేతో షర్మిల భేటి…

– నేడు సోనియాతో సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైఎస్సార్‌ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం హైదరాబాద్‌లో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌ టీపీ విలీనంతోపాటు తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్టు సమాచారం. కాగా ఆదివారం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీతో షర్మిల భేటీ కానున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హస్తం పార్టీలో ఆమె చేరిక దాదాపు ఖరారైనట్టే.

Spread the love