– విడాకులు కాకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు
– భర్త ఇంటి ఎదుట భార్య కుటుంబ సభ్యుల ఆందోళన…
– తాళం వేసి పరారైన అత్తింటి వారు….
– కేశవపట్నంలో ఘటన….
నవతెలంగాణ – శంకరపట్నం
ఓ బాధితురాలు తన బిడ్డకు భర్త అత్తింటి వారు అన్యాయం చేస్తున్నారని కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి బాధితురాలు అత్తవారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలు బొంగొని శిరీష,మాట్లాడుతూ,తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన శిరీషకు 2017లో కేశవపట్నం గ్రామానికి చెందిన బొంగోని శ్రీనివాస్ రాజేశ్వరి కుమారుడైన బొంగోని ప్రవీణ్ తో వివాహం జరగగా వివాహ సమయంలో ఆడబిడ్డ కట్నంగా కోరినంత డబ్బుతో సహా ఇతర ఆడబిడ్డ లాంఛనాలు పెట్టి హిందూ సాంప్రదాయంగా వ్యవహారం జరిపించి అత్తారింటికి పంపించామని, 2018లో శిరీష ప్రవీణ్ లకు కుమార్తె జన్మించింది. బిడ్డ పుట్టినందుకు అదనంగా 2 లక్షల రూపాయలు కావాలంటే శిరీష తల్లిదండ్రులు బిడ్డ కుటుంబం బాగుపడుతుందని అదనంగా 2 లక్షల రూపాయలు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు శిరీష తల్లిదండ్రులు బిడ్డ బాగుకోసం అప్పగించిన, తన బిడ్డను శారీరకంగా తమను మానసికంగా ప్రవీణ్ అతని తల్లిదండ్రులైన రాజేశ్వరి శ్రీనివాసులు వేధించడంతో కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపారని, ప్రస్తుతం తమ కేసు కోర్టులో విచారణ కొనసాగుతుందని, ప్రవీణ్ తల్లిదండ్రులైన శ్రీనివాస్ రాజేశ్వరి ప్రవీణ్ కు విడాకులు మంజూరు కాకముందుకే మరో యువతితో వివాహం చేశారని తమకు సమాచారం అందడంతో తన ఇంటికి వచ్చి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసినట్లు,వెల్లడించారు.తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడే తన కూతురితో కుటుంబ సభ్యులతో నిరసన వ్యక్తం చేస్తానని శిరీష కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారము తెలుసుకున్న కేశవపట్నం ఏ ఎస్ ఐ సుధాకర్ ఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నాడు