నవతెలంగాణ-హైదరాబాద్ : ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడింది. వారం రోజుల హై టెన్షన్‌కు.. రెండు పార్టీలు ఫుల్‌స్టాప్ పెట్టేశాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పీపీపీ, పీఎంఎల్-ఎన్ మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం అర్థరాత్రి ఇస్లామాబాద్‌లోని జర్దారి ఇంట్లో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మెన్ బిలావాల్ భుట్టో జర్దారి కీలక ప్రటకన చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీఎంఎల్-ఎన్, పీపీపీ వద్ద కావాల్సినంత సభ్యులు ఉన్నట్లు భుట్టో తెలిపారు. దేశ అధ్యక్ష బాధ్యతలను అసిఫ్ అలీ జర్దారి చేపట్టనున్నారు. జాతీయ అసెంబ్లీలో స్పీకర్ పోస్టు పీఎంఎల్-ఎన్ పార్టీకి దక్కనున్నది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి పీపీపీకి వెళ్లనున్నది. సేనేట్‌లో చైర్మెన్ పదవి పీపీపీ ఖాతాలో వెళ్లనున్నది. డిప్యూటీ చైర్మెన్ పదవి నవాజ్ లీగ్‌కు దక్కనున్నది.