బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్

నవతెలంగాణ- చిట్యాల: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చిట్యాల మాజీ జెడ్పిటిసి శేపూరి రవీందర్ బుధవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, నలగొండ జిల్లా జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, గీత కార్మిక స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్  ఆధ్వర్యంలో మంత్రి కెటిఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు పల్లపు బుద్ధుడు, నకిరేకల్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ చెరుకు లింగస్వామి గౌడ్, వార్డు సభ్యులు చేపూరి రాజు, నాయకులు గోపగొని నరసింహ, మేడి రవీందర్, బరిశెట్టి సత్యనారాయణ, పబ్బు లింగస్వామి, పోకల రాములు, ఇమ్మడి విజయ్, పాకాల దినేష్, పొలిమేర రామ్ కుమార్, రావుల వెంకన్న, ఆగు సైదులు, శివరాత్రి కొండల్, గంజి తులసీదాస్, నరసింహ సైదులు, మాస నరేష్ మాస వేణు, శివకుమార్, మాస కృష్ణ, మాస శేఖర్, పిల్లి రవి, ఏరుకొండ సాయి, పవన్ మహేష్, నాగరాజు, రవి, నవీన్ తదితరులు కూడా పార్టీలో చేరారు.
Spread the love