మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరనున్న “శేపూరి”

నవతెలంగాణ చిట్యాల: బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చిట్యాల మాజీ జెడ్పీటిసి, 1వ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ ఇంటికి వెళ్ళి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి రావాలని మంగళవారం రాత్రి మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆహ్వానించారు. హైదరాబాద్ కు వెళ్ళి బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐ టీ శాఖల మంత్రి కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరనున్నారు.
Spread the love