మెరిసిన మెర్లిన్‌

Shining Merlinఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌… దీని గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ రోజుల్లో మనం ఉపయో గించే చాలా ఎలక్ట్రానిక్‌ పరికరాలు దీని ద్వారానే నడుస్తున్నాయి. మనం ఎక్కడ ఏది బ్రౌజ్‌ చేసినా అందుకు సంబంధించిన సమాచారం ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారానే మనకు అందుబాటులోకి వస్తుంది. ఇందులో నూతన ఒరవడి అయిన మెర్లిన్‌కు శ్రీకారం చుట్టారు ప్రత్యూష్‌ రారు. అతని స్నేహితుల కలిసి ప్రారంభించిన ఫోయర్‌ – మెర్లిన్‌ అలతి కాలంలో వినియోగదారులను పెంచుకుంది. ఈ మెర్లిన్‌ పని తీరు గురించి ఈ వారం జోష్‌…

రారు మాటల్లో చెప్పాలంటే ‘బీసీజీలో రారు అనుభవంతో నేర్చుకున్న ఎన్నో పాఠాలు ‘మెర్లిన్‌’ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. ఆ అనుభవ పాఠాలు తన ప్రపంచాన్నే మార్చేసి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి.ప్రత్యూష్‌ రారు ఫోయర్‌-మెర్లిన్‌కి ఆద్యుడు. ఐఐటీ-కాన్పూర్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. గ్లోబల్‌ కన్సల్టెన్సీ బీసీజీతో కలిసి పని చేసేవాడు. అందులో భాగంగా ఒక పెద్ద వినియోగదారు ఉత్పత్తుల కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్న బృందంలో ఉన్నాడు. అది చాలా పెద్ద ప్రాజెక్టు. అదే సమయంలో అతను కోవిడ్‌ బారిన పడ్డాడు. కోవిడ్‌ ప్రభావం ఉన్న సమయం కావడంతో కంపెనీకి నగదు కొరత ఏర్పడింది. దాని వల్ల కంపెనీ ఎదుర్కొనే సమస్యలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యక్షంగా చూశాడు. అయినప్పటికీ అతని క్లయింట్‌ ఉద్యోగులను తొలగించాలని అనుకోలేదు. అయితే వీరి పోటీదారు మాత్రం చాలా మంది ఉద్యోగులను తొలగించాడు. అయితే తర్వాత వారి సంస్థలో కొన్ని వారాల్లోనే నగదు సంక్షోభం సమస్య తీరినప్పటికీ అది అతని మనసులో తీవ్ర ప్రభావం చూపించింది. బీపీజీ అనుభవాలు అతనిలో తీవ్ర అంతర్మథనాన్ని రేకెత్తించాయి. అందరికీ ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న ఆలోచనల నుంచి ఏర్పడిందే మెర్లిన్‌ ఏఐ.
స్నేహితులతో కలిసి…
ఇతనితో పాటు కాలేజ్‌ ఫ్రెండ్స్‌ అయిన సిద్ధార్థ సక్సేనా, సిరిసేందు సర్కార్‌ లతో కలిసి ఏదైనా తమ సొంతంగా చేయాలనే ఉత్సాహంతో ఉండేవారు. అనేక ఆలోచనల తర్వాత ”అందరికీ ఉపయోగపడేలా, వ్యక్తి అవసరానికి అనుగుణంగా శోధిస్తే, దానికి దగ్గరి ఫలితాన్ని అందించేలా ఏదైనా చేయాలని” నిర్ణయానికి వచ్చారు. ఆ ఆలోచనల నుంచి మొదలైన ప్రయాణం 2021లో ‘మెర్లిన్‌’ గా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇది క్రోమ్‌కు ఎక్స్‌టెన్షన్‌గా, ఒక్క బటన్‌ క్లిక్‌తో చాట్‌ జీపీటీగా వినియోగదారుల మన్నలను పొందుతోంది.”మెర్లిన్‌ చాలా సులభమైన ఉత్పత్తి. ఇది అన్ని బ్రౌజర్‌లో పొందుపరచి ఉంటుంది. యూట్యూబ్‌, జీమెయిల్‌, లింక్‌డ్‌ ఇన్‌, ట్విట్టర్‌ వంటి రోజువారీ వినియోగాల్లో భాగాలైన సైట్‌లో ఉంటూ, క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తుంది.” అని రారు వివరించాడు.
మెర్లిన్‌ ఏఐ అంటే ఏమిటి?
మెర్లిన్‌ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌. మనిషి కంప్యూటర్‌ కన్వర్జేషన్‌ను మనం చాట్‌బాట్‌ అంటాం. ఉదాహరణకు మనం ఏదైనా యాప్‌లో హెల్ప్‌ సపోర్ట్‌ కోసం చాట్‌ చేసినపుడు మొదట హారు అని పెడతాం. అవతలి నుంచి కూడా మనకు రిప్లై వస్తుంది. కానీ అది మనిషి ఇచ్చే రిప్లరు కాదు. కంప్యూటర్‌ ఆధారిత చాటింగ్‌. అంటే కేవలం మనం అడిగే ప్రశ్నలకు కంప్యూటర్‌ సమాధానం ఇస్తుంది. ఈ ఉపయోగించే విధానాన్ని చాట్‌ బాట్‌ అంటాం. ఈ ఉపయోగించే విధానాన్ని చాట్‌ జీపీటీ అంటాం. చాట్‌ అంటే తెలుసు. మరి జీపీటీ అంటే… జనరేటివ్‌ ప్రీ ట్రైన్‌డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ ముందుగానే కంప్యూటర్‌లో పొందుపరిచి ఉంటుంది. దీని ద్వారా వర్చువల్‌ సంభాషణలు కొనసాగించే వీలుంటుంది. మనకు అవసరమైన ఏ సమాచారాన్ని అయినా దీనిలో సెర్చ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏదైనా ఒక వస్తువు ఉపయోగం గురించి సెర్చ్‌ చేస్తే దానిని ఎలా ఉపయోగించాలనే అంశం టెక్స్ట్‌ రూపంలో డిస్‌ప్లే అవుతుంది. ఏదైనా ఒక పేరుగాంచిన వ్యక్తి గురించి సమాచారం కావాలంటే ఆ వ్యక్తి పూర్తి బయోడేటాను టెక్స్ట్‌ రూపంలో చూపిస్తుంది. దీనికి ఇంటర్నెట్‌ సహాయం అవసరం ఉండదు. అంతేకాదు దీనిని 2021 వరకు మాత్రమే అప్‌డేట్‌ చేసి ఉంచారు. ఆ లోపు జరిగిన సంఘటనలు, వ్యక్తుల వివరాలు, ప్రాజెక్టులు ఇలా ప్రతి అంశం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి అడిగితే సారీ నో ఇన్ఫర్మేషన్‌ అని చూపిస్తుంది. అయితే దీనిని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఆ ప్రయోగం విజయవంతమైందంటే.. గూగుల్‌ వెనుకబడిపోతుంది.
గూగుల్‌ సెర్చ్‌కి చాట్‌ జీపీటీ మధ్య తేడాలు
మనం ఎవరైనా పేరుగాంచిన వ్యక్తి గురించి లేదా ఒక వస్తువు సమాచారం తెలుసుకోవాలంటే గూగుల్‌ సెర్చ్‌లో అందుకు సంబంధించిన వందలకొద్ది లింక్‌లు వస్తాయి. ఇందులో అలా ఉండదు. కేవలం మనం సెర్చ్‌ చేసిన అంశం గురించి ఒకటే సమాధానం మొత్తం టెక్స్ట్‌ రూపంలో చూపిస్తుంది. ఏదైనా ప్రోగ్రామ్స్‌ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. అందుకే లాంచ్‌ చేసిన ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఉపయోగించారు. దీని వల్ల విద్యార్థులకు అడ్వాంటేజ్‌, డిస్‌ అడ్వాంటేజ్‌ ఉన్నాయి. ఉదాహరణకు మాథ్స్‌కు సంబంధించిన ప్రాబ్లెమ్‌ ఏదైనా అడిగితే పాయింట్‌ టు పాయింట్‌ థియరీ ఉదహరించుకుంటూ వెళుతుంటుంది. దీని వల్ల ఎగ్జామ్స్‌లో మిస్‌ యూజ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా వినియోగం..
అమెరికా, తూర్పు ఆసియా, యూరోప్‌లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులున్నారు. ఫోయర్‌ – మెర్లిన్‌ను ప్రారంభించిన ఆరు నెలల్లోనే దాదాపు లక్షల్లో వినియోగదారులు 750,000 ఇన్‌స్టాల్‌లలో దూసుకుపోయింది. ఇందులో 85 నుంచి 90 శాతం మంది వినియోగదారుల వారి బ్రౌజర్‌లలో మెర్లిన్‌ను ఎనేబుల్‌ చేసిన వారేనని పేర్కొన్నారు. ‘మెర్లిన్‌ సక్సెస్‌కు కారణం దానిపై యూజర్లకు కుదిరిన నమ్మకమే’. ”వాస్తవానికి, మా దష్టి డెవలపర్‌లపై చాలా లోతుగా ఉంది, కానీ ప్రజలు మా ఉత్పత్తిని చాలా ఆసక్తికరమైన మార్గాల్లో ఉపయోగిస్తున్నారని మేం గ్రహించాం – మార్కెటర్లు మెర్లిన్‌ను కేవలం కమాండ్‌ బార్‌ ఇంటర్‌ఫేస్‌గా ఉన్నప్పటి నుండి ఉపయోగిస్తున్నారు” అని రారు గుర్తు చేసుకున్నారు. ఈ సక్సెస్‌తో వాళ్ళు ఆగిపోవాలనుకోవడం లేదు. ఇందులో ఇంకొన్ని సబ్‌ ఫీచర్లు తీసుకురావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది.
– రమాదేవి

Spread the love