టిడిపి పార్లమెంట్ మహబూబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివ ప్రసాద్

నవ తెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహబూబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మండల కేంద్రానికి చెందిన నర్ర శివప్రసాద్ ఎన్నికయ్యారు. శనివారం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ధ్రువ పత్రంతో చూపించి మాట్లాడారు. 1983 నుండి పార్టీ ఆవిర్భావం మొదలుకొని క్రియాశీల కార్యకర్తగా గ్రామ కమిటీ అధ్యక్షునిగా వార్డు సభ్యునిగా మహబూబాద్ పార్లమెంట్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యునిగా విశిష్ట సేవలను అందించినందుకు గాను గుర్తించి ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేసి పూర్వవైభవం కోసం కష్టపడతానని అన్నారు. అత్యున్నత పదవికి ఎంపిక చేసిన టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ,మరియు యువ నేత నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజు నాయక్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యానాల అనంతరెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కొండపల్లి రామచంద్రరావు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్ల వెంకన్నకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Spread the love