మండలం ఏర్పాటు ఘనత శివాజీదే..

నవతెలంగాణ -గోవిందరావుపేట
కీర్తిశేషులు వీరపనేని శివాజీ మూడవ వర్ధంతి గోవిందరావుపేట మండలం ఏర్పాటు ఘనత వీరపనేని శివాజీదే అని జడ్పిటిసి తుమ్మల హరిబాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వీరపనేని శివాజీ మూడవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి తుమ్మల హరిబాబు హాజరై శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం హరిబాబు మాట్లాడుతూ నేడు గోవిందరావుపేట మండలం గా సగర్వంగా చెప్పుకుంటున్న మనం ఈ మండలం ఏర్పాటు శివాజీ కృషి వల్లే ఏర్పడిందని గర్వంగా చెప్పుకుంటున్నామని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు క అత్యంత సన్నిహితుడు స్నేహితుడు వీరపనేని శివాజీ మండలానికి చేసిన సేవలు ఎనలేని వని కొనియాడారు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని ఒప్పించి గ్రామంలో 400 ఇళ్ళను కట్టించి ఇచ్చిన ఘనుడని అన్నారు. ప్రతి సంవత్సరం ఎంతోమంది పేద ప్రజలకు శీతాకాలంలో దుప్పట్లు కంబల్లు చెద్దర్లు బట్టలు శివాజీ స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు  పంపిణీ చేసేవారని అన్నారు. వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తరువాత ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు స్టాఫ్ కి ప్రభుత్వ బాలికల వసతి గృహం లోని విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, సూరపనేని నాగేశ్వర్ రావు, వీరపనేనీ పణి కుమార్, ప్రసాద్ రావు, పాలడుగు వెంకట కృష్ణ, తలశిల వెంకటేశ్వర్ రావు, మువ్వ రామారావు, గ్రామ పంచాయితీ సిబ్బంది మరియు
జోగా నాయక్, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Spread the love