నవతెలంగాణ-హైదరాబాద్ : కన్నడతోపాటు తెలుగులోనూ గుర్తింపు ఉన్న హీరో శివరాజ్ కుమార్. ఈ మధ్య రజనీకాంత్ ‘జైలర్’ చిన్న పాత్రలో కనిపించినా తెలుగు ప్రేక్షకులు ఆయనను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ‘ఘోస్ట్’ సినిమాతో పూర్తిస్థాయి తెలుగు సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ మంచి స్పందన లభించింది.శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివన్న మాస్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా చిత్రం బృందం ట్రైలర్‌ను రిలీజ్ చేపింది. ‘సామ్రాజ్యాలు సృష్టించే వాడిని చరిత్ర మర్చిపోతుందేమో కానీ.. విధ్వంసం సృష్టించిన వాడిని ఎప్పుడూ మర్చిపోదంటూ’ అనే డైలాగ్ తో సినిమా ఎలా ఉండబోతుందనే హింట్ ఇచ్చారు. సాఫ్ట్‌గా ఉండే శివన్న వైలెంట్ మ్యాన్‌గా మారి శత్రువులను చీల్చీ చెండాడుతూ ఉంటాడు. శివన్న విధ్వంసం వెనుక కారణాలేంటి? ఆయన ఉద్దేశం ఏంటనేది సస్పెన్స్‌గా ఉంచుతూ ట్రైలర్ మొత్తం యాక్షన్ తో నిండిపోయింది. ఈ సినిమా ఈనెల 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ మొత్తం మూడు గెటప్స్‌లో అలరించనున్నాడు.