బిగ్‌బాస్‌ నుంచి శోభాశెట్టి ఎలిమినేట్‌..

నవతెలంగాణ – హైదరాబాద్: బిగ్‌బాస్‌ సీజన్‌-7 చివరి వారంలోకి అడుగు పెడుతోంది. ఈ క్రమంలో ఈ ఆదివారం ఎంతో ఫన్​గా గడిచింది. అయితే ఈ వారం హౌస్ నుంచి ఫైర్ బ్రాండ్ శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ఆమె తన జర్నీ చూసి ఎమోషనల్ అయింది. ప్రస్తుతం హౌస్‌లో అమర్‌, అర్జున్‌, ప్రియాంక, యావర్‌, పల్లవి ప్రశాంత్‌, శివాజీలు మిగిలగా.. వీరే ఫైనలిస్ట్‌లు అంటూ నాగార్జున ప్రకటించారు. స్టేజ్ మీదకు వచ్చిన శోభా శెట్టిని హౌస్‌లో ఉన్న వాళ్లలో గుడ్‌ సైడ్‌, బ్యాడ్‌సైడ్‌ ఏంటో చెప్పాలని నాగార్జున అడిగారు. అర్జున్​కు బ్యాడ్‌సైడ్‌ అంటూ ఏమి లేదుని.. కాకపోతే, గతవారం ఓటింగ్‌లో లాస్ట్‌లో ఉన్నానని నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాడని.. దాని నుంచి బయటకు రావాలని చెప్పుకొచ్చింది శోభ. ఇక ప్రియాంక బాగానే ఆడుతుందని గొడవ పడినా తొందరగా కలిసిపోతుందని చెప్పింది. కానీ చెప్పేటప్పుడు మన మాట వినదని అదొక్కటే బ్యాడ్‌ అని తెలిపింది. ఆట విషయంలో యావర్​కు కాన్ఫిడెన్స్‌ ఉందని కానీ ఎదుటి మనుషులను మాత్రం అర్థం చేసుకోడని అంది. ప్రశాంత్‌ పరిస్థితులను బట్టి రియాక్ట్‌ అవుతాడని పేర్కొంది. హౌస్‌లో పరిస్థితులు బట్టి కోపాన్ని ఎదుటివారిపై చూపించాల్సి ఉంటుందని ఆ విధంగానే శివాజీ ప్రవర్తించారని అందరినీ గైడ్‌ చేస్తారని చెప్పింది. ఇక అమర్​ను ట్రోఫీ తీసుకుని అనంతపురానికి వెళ్లాలని.. అలా జరగాలంటే ఆవేశం వదిలేసెయ్‌ అని చెప్పుకొచ్చింది ఈ కన్నడ భామ శోభా శెట్టి.

Spread the love