తొలి సెష‌న్‌లో ఆసీస్‌కు షాక్..

నవతెలంగాణ – ఇంగ్లడ్: నాలుగోవ రోజు తొలి సెష‌న్ మొద‌లైన కాసేప‌టికే భార‌త్‌కు బ్రేక్ దొరికింది. డేంజ‌ర‌స్ మార్న‌స్ ల‌బూషేన్(41)ను ఉమేశ్ యాద‌వ్ ఔట్ చేశాడు. లబూషేన్ ఆడిన బంతిని స్లిప్‌లో పూజారా చ‌క్క‌గా అందుకున్నాడు. దాంతో, ఆస్ట్రేలియా స‌గం వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం కామెరూన్ గ్రీన్(8), అలెక్స్ క్యారీ(4) క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జ‌ట్టు స్కోర్.. 128/5. కంగారూ టీమ్ 301 ప‌రుగుల‌ ఆధిక్యంలో ఉంది.

 

Spread the love