ఢిల్లీ : మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌ను తాజాగా తిరస్కరించింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని జూన్ 19 వరకు పొడిగించింది. ఆయన వైద్య అవసరాలను చూసుకోవాలని జైలు అధికారులకు ఆదేశించింది.