షాప్సీ యాప్ 3వ సంవత్సరం నాటికే 330 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌

నవతెలంగాణ – బెంగళూరు: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న హైపర్-వేల్యూ ప్లాట్‌ఫాం షాప్సీ తన మూడేళ్ల ప్రస్థానంలో భారత్‌వ్యాప్తంగా 330 మిలియన్ యాప్‌ డౌన్‌లోడ్స్ ఘనతను సాధించిందని తెలియజేయడానికి సంతోషిస్తోంది. గత మూడేళ్లలో 1,300 కేటగిరీల వ్యాప్తంగా అందుబాటు ధరలో ఉత్పత్తులను అందిస్తూ, 19,000 పైచిలుకు పిన్ కోడ్‌లకు కార్యకలాపాలను విస్తరించి, భారత్‌లో నగరాలు, పట్టణాలవ్యాప్తంగా 1.4 మిలియన్ల (ఫ్లిప్‌కార్ట్ సహా) విక్రేతలకు తోడ్పాటు అందిస్తూ, హైపర్‌వేల్యూ ఆన్‌లైన్ షాపింగ్ అనుభూతి మరింత మెరుగ్గా ఉండేందుకు షాప్సీ కృషి చేస్తోంది. ప్లాట్‌ఫామ్ మూడో వార్షికోత్సవం సందర్భంగా షాప్సీ బిజినెస్ హెడ్ ప్రత్యూష అగర్వాల్ మాట్లాడుతూ, మమ్మల్ని ఫేవరెట్ హైపర్-వేల్యూ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా నిలిపిన మా కస్టమర్లు, విక్రేతలు, భాగస్వాములతో కలిసి మేము ఈ ఘనతను వేడుకగా జరుపుకుంటున్నాం. భారత్ అవసరాలకు అనుగుణంగా అసాధారణ స్థాయిలో విలువను జోడించడం, వినూత్నత, మరియు కస్టమర్ ఆధారిత విధానాలను పాటించడంపై మాకు గల నిబద్ధతకు ఈ ప్రస్థానం నిదర్శనంగా నిలుస్తుంది. 2030 నాటికి భారత ఈ-కామర్స్ పరిశ్రమ 300 బిలియన్ డాలర్ల (US$)కు చేరనున్న నేపథ్యంలో మా ఆఫర్లను, సాంకేతికత సామర్ధ్యాలను మరింతగా మెరుగుపర్చుకునేందుకు, అలాగే ఆదాపై ప్రధానంగా దృష్టి పెట్టే భారత్ వినియోగదారులకు అసమానమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉంటాం అని తెలిపారు.
కార్యకలాపాల విస్తరణ, కస్టమర్ అనుభూతిని మెరుగుపరచడం
కేవలం మూడేళ్ల వ్యవధిలోనే షాప్సీ అన్ని ప్రాంతాల్లోని కస్టమర్లకు సేవలు అందించే దిశగా దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించింది. షాప్సీ వినియోగదారులు భారత్‌లోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నారు.  బిల్గీ, ఫుల్, ఫరీద్‌కోట్, నాగర్‌కోయిల్ వంటి అనేక ప్రాంతాల్లో కొత్త ఈ-కామర్స్ షాపర్స్ ఉంటున్నారు. షాప్సీ కస్టమర్లలో దాదాపు 70% మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉంటుండగా, కొత్త కస్టమర్లలో 90% మంది మిలీనియల్స్ మరియు జెన్-జడ్ తరం వారు ఉంటున్నారు. పటిష్టమైన సరఫరా వ్యవస్థ మరియు లాజిస్టిక్స్ నెట్‌వర్క్, తోడుగా టెక్నాలజీ మౌలిక సదుపాయాలు కార్యకలాపాల విస్తృతికి దన్నుగా ఉంటున్నాయి. మెరుగైన యూజర్ అనుభూతి, స్మార్ట్ సూచనలు, కస్టమర్ల సందేహాలను తీర్చేందుకు ఏఐ-ఆధారిత చాట్‌బాట్స్, నిరాటంకమైన పేమెంట్ గేట్‌వేలు మొదలైన అంశాలు, కొనుగోలు అనుభూతిని మరింత మెరుగుపరుస్తున్నాయి. మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. వచ్చిన కస్టమర్లు వెళ్లిపోకుండా, కొనసాగేలా చూసుకునేందుకు తోడ్పడుతున్నాయి.
షాప్సీ వృద్ధి, వేల్యూ, ఇంకా ఎంగేజ్‌మెంట్ ప్రస్థానం
దిగ్గజ వేల్యూ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా షాప్సీ వృద్ధి ప్రస్థానమనేది భారత్‌లో డబ్బును ఆదా చేసే ఉత్పత్తులకు గల అత్యధిక డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. ఈ హైపర్‌వేల్యూ శ్రేణిలో షాప్సీ మరింతగా విస్తరించింది. సంస్థ షాపర్లలో 70% మంది రూ. 200 లోపు ఉత్పత్తులను విస్తృతంగా కొనుగోలు చేశారు. పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగైన రేట్లకే ఉత్పత్తులను కొనుగోలు చేసే ఆప్షన్లను అందించడం ద్వారా షాప్సీ తమ కస్టమర్లకు మరింత విలువను చేకూరుస్తోంది. షాప్సీ సమగ్ర పోర్ట్‌ఫోలియోలో 16 మిలియన్ల పైచిలుకు ఉత్పత్తులు ఉన్నాయి. ప్రతి భారతీయ కుటుంబానికి అవసరమైన ఫ్యాషన్, సౌందర్య సాధనాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మొదలైనవన్నీ వీటిలో ఉన్నాయి. కస్టమర్ సంతృప్తే ప్రధాన లక్ష్యంగా బడ్జెట్ మొబైల్స్, కిడ్స్‌వేర్, యాక్సెసరీస్ వంటి మరెన్నో కొత్త కేటగిరీలను షాప్సీ ఆవిష్కరిస్తోంది. షాప్సీ తాజాగా ప్రవేశపెట్టిన ‘ట్రెండ్ స్టేషన్’ అనేది ఫ్యాషన్, బ్యూటీలో వైరల్ అవుతున్న ధోరణులను ప్రతిబింబిస్తూ ట్రెండ్స్‌ను ఇష్టపడే భారతదేశ జెన్-జడ్ తరాన్ని ఆకట్టుకుంటోంది.
సాధారణంగా తమ కుటుంబాలతో కలిసి కొనుగోళ్లు చేసే భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు షాప్సీ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన సేల్ ఈవెంట్లను నిర్వహిస్తోంది. అంతా ఆసక్తిగా ఎదురుచూసే గ్రాండ్ షాప్సీ మేళా, మెగా షాపింగ్ ధమాకా, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ మొదలైనవి వినియోగదారులు తమకు ఇష్టమైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు తరచుగా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు 2024 మార్చిలో నిర్వహించిన గ్రాండ్ షాప్సీ మేళా నాలుగో ఎడిషన్‌ సందర్భంగా మా ప్లాట్‌ఫామ్‌పై ఒకే రోజులో అత్యధిక యూజర్ల ట్రాఫిక్ నమోదైంది. అలాగే, మా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ తొలి ఎడిషన్‌లోనూ కస్టమర్లు భారీగా పాల్గొన్నారు. ఇలాంటి  ఈవెంట్లు విక్రేతల అభివృద్ధి, శ్రేయస్సుకు కూడా ఎంతగానో దన్నుగా నిలిచాయి. ఈ ఈవెంట్ల సందర్భంగా చాలా మంది విక్రేతల వ్యాపారం 3 రెట్లు పెరిగింది.
విస్తృతమైన విక్రేతల కమ్యూనిటీ
రాజ్‌కోట్, సూరత్, పానిపట్, ఘాజియాబాద్ తదితర అనేక నగరాల్లో విక్రేతల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమనేది షాప్సీ విజయాలను ప్రతిబింబిస్తుంది. సమగ్రమైన శిక్షణా కార్యక్రమమనేది అత్యుత్తమ పనితీరు, విధానాలను పాటించే సంస్కృతిని పెంపొందించడంలో తోడ్పడుతోంది. అధిక అమ్మకాలు, వ్యాపార వృద్ధి సాధనకు, ముఖ్యంగా సేల్ ఈవెంట్లలో విక్రయాలు మూడింతలు పెరిగేందుకు ఇది దోహదకారిగా ఉంటోంది. స్టార్ సెల్లర్ వంటి కార్యక్రమాలు, అత్యుత్తమ ఫలితాలు సాధించివారికి ప్రోత్సాహకాలు అందిస్తూ, విక్రేతల పనితీరు ప్రమాణాలకు  తగ్గట్లు స్థిరంగా కొనసాగేలా చూసేందుకు తోడ్పడతాయి. మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, రాబోయే వారంలో షాప్సీ తాజాగా షాప్సీ బర్త్‌డే సేల్ పేరిట సేల్ ఈవెంట్‌ను కూడా ఆవిష్కరించబోతోంది. “ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ కేంద్రంగా పనిచేసే RHYSLABIS బ్రాండ్ పురుషులు మరియు మహిళలకు క్యాజువల్, ఫార్మల్ దుస్తుల తయారీ, విక్రయాల కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2022లో మేము మా ఇంటి వద్ద నుంచే షాప్సీలో చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించాం. స్వల్పకాలంలోనే మేము మా వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకునేందుకు షాప్సీతో మాకు అవకాశం లభించింది. నేను 13 ఏళ్లకు పైగా చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టాను. ఇప్పుడు మా సొంత తయారీ అలాగే ప్యాకింగ్, డిస్పాచింగ్ యూనిట్‌ను భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. RHYSLABIS ఇప్పుడొక విశ్వసనీయమైన, పేరొందిన బ్రాండ్. పురుషులు మరియు మహిళలకు సౌకర్యవంతమైన, నాణ్యమైన దుస్తులను మేము స్వయంగా డిజైన్ చేసి, విక్రయించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాం అని RHYSLABIS బ్రాండ్ యజమాని సర్ఫరాజ్ తెలిపారు. “ఒక వ్యాపార సంస్థగా మేము ఆన్‌లైన్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. మహిళల దుస్తులకు సంబంధించిన మా వ్యాపారమంతా ఆఫ్‌లైన్‌లోనే ఉండేది. అయితే, షాప్సీ మార్కెట్‌ప్లేస్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాక, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో భారీ స్పందన వచ్చింది. ఈ ప్రయాణంలో షాప్సీ టీమ్ మాకెంతగానో తోడ్పాటు అందించింది. ఆన్‌లైన్ అమ్మకాల కారణంగా నిత్యం మా టర్నోవర్ పెరుగుతుండటంతో మా వ్యాపారాన్ని మరింతగా విస్తరించగలిగాం” అని షాప్సీలో విక్రయించే మరో విక్రేత శ్రాష్టి టెక్స్‌టైల్స్ డైరెక్టర్ సచిన్ చక్రవర్తి తెలిపారు.

Spread the love