నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబైలోని బాంద్రా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబా సిద్ధిక్‌పై గుర్తుతెలియని ఆగంతకులు కాల్పులు జరిపారు. బాంద్రా ఈస్ట్‌లోని ఆయన కుమారుడు జీషన్ కార్యాలయం బయట ముగ్గురు వ్యక్తులు బాబా సిద్ధిక్‌పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఉన్న ఆయన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. “దుండగులు రెండు, మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. సమాచారం అందగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నాం” అని తెలిపారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలో చేరారు.