
నవతెలంగాణ – మల్హర్ రావు
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మండల ఎంపీడీఓ శ్యాం సుందర్ కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా జెడ్పీసీఈఓ విజయలక్ష్మి ని అదేశించినట్లుగా తెలిసింది. అయితే తాగునీటిపై నివేదికలు అందజేయడంలో జాప్యం వహించినందుకు గాను షోకాజ్ నోటీస్ జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.