నేడు అనేక పత్రికలు పెట్టుబడిదారుల పత్రికలుగా ఉన్నాయి. కానీ, ‘నవతెలంగాణ’ శ్రమజీవుల కోసం స్థాపించిన పత్రిక. ప్రజల కోసం పోరాడే పత్రిక. వామపక్ష భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేసే పత్రిక. నాడు ప్రజాశక్తి అయినా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ‘నవతెలంగాణ’గా మారినా ఈ పత్రిక శ్రమజీవుల కూడు, గూడు, గుడ్డ కోసం నిరంతరం శ్రమిస్తోంది. అలాంటి నవతెలంగాణ 9 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పత్రికా యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు శుభాకాంక్షలు.
– డాక్టర్ అంపశయ్య నవీన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత