శ్రవణ్‌కుమార్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న న్యూస్‌ ఛానల్‌ ఎండీ శ్రవణ్‌కుమార్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. చాలా మంది ముఖ్యమైన వ్యక్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో శ్రవణ్‌కుమార్‌ హస్తం ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో అతని పాత్రపై ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో అనేక విషయాలు ఉన్నాయన్నారు. శ్రవణ్‌కుమార్‌ను ప్రకటించబడ్డ నేరస్తుడిగా పరిగణించాలని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయొద్దని పీపీ కోరారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో శ్రవణ్‌కుమార్‌కు సంబంధం లేదని అతని తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తికాగా, తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.

Spread the love